వెన్నుపోటు రాజకీయం అనే పదం వినిపిస్తే చాలు అందరికీ వెంటనే గుర్తుకు వచ్చేది చంద్రబాబు తన మామ ఎన్టీఆర్ కు చేసిన ద్రోహం. అంత జనాల్లోకి ఈ వెన్నుపోటు గుచ్చుకుంది. అది జరిగి చాలా ఏళ్ళ గడుస్తున్నా, ఇప్పటికీ ఆ వ్యవహారం ఏదో ఒక రకంగా హైలెట్ అవుతూనే వస్తోంది. సందర్భం వచ్చినప్పుడల్లా, రాజకీయ నాయకులు జనాలకు గుర్తు చేస్తూనే ఉంటారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సేమ్ అదే సేమ్ రిపీట్ కాబోతోంది అంటూ రాజకీయ వర్గాల్లో మరో కొత్త అంశం తెర మీదకు వచ్చింది. అదే చంద్రబాబు తనయుడు లోకేష్ తన మేనమామ ప్లస్ పిల్లనిచ్చిన మామ నందమూరి బాలకృష్ణ కు సేమ్ అదే వెన్నుపోటు రాజకీయం చూపించబోతున్నాడు అంటూ సెటైర్లు పేలుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే .. 2019 ఎన్నికల్లో లోకేష్ అమరావతి ప్రాంతంలో తనకు మంచి పట్టు ఉందనీ, ఇక్కడే టిడిపి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు జనాల్లోకి వెళ్ళాయి అనే ఉద్దేశంతో ఆ ప్రాంతంలోని మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే అక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణ రెడ్డి ప్రభావం… ఏపీలో ఫ్యాను గాలి బలంగా వీయడం వంటి కారణాలతో లోకేష్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది .
ఇక అప్పటి నుంచి రాజకీయంగా లోకేష్ ఎన్నిరకాలు గా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళగిరిలో ఓటమిని ఇప్పటికీ రాజకీయ ప్రత్యర్థులు హైలెట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మొత్తం లోకేష్ చేతుల్లోకి వెళ్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే రానున్న ఎన్నికలు అత్యంత కీలకం కాబోతున్న తరుణం లో తన గెలుపు కి ఎటువంటి డోకా లేకుండా చేసుకునేందుకు లోకేష్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నరుం మంగళగిరిలో ఉన్న కుల సమీకరణాలు తనకు అంతగా కలిసిరావనే ఉద్దేశంలో ఉన్న లోకేష్ గుంటూరు జిల్లాలోని కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్న ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీకి దిగాలని చూస్తున్నారట . టిడిపి అధినేత చంద్రబాబు దీనికి స్కెచ్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఒక నియోజకవర్గంలో మాత్రమే పోటీ చేస్తే, అక్కడ ఏదైనా తేడా వస్తే మొదటికే మోసం వస్తుంది అనే ఉద్దేశంతో రెండో ఆప్షన్ గా మరో నియోజకవర్గాన్ని ఎంచుకొనే పనిలో లోకేష్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ సీటు ఎక్కడా అనే సందేహంలో అంతా ఉండగానే ,టీడీపీకి కంచుకోటగా ఉంటూ వస్తున్న అనంతపురం జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందట. అయితే ఇప్పటికే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ ఈ సీటు ఇప్పటికీ ఎప్పటికీ తనదే అనే ఉద్దేశం లో ఉండగా , ఇప్పుడు లోకేష్ ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే తన గెలుపుకి డోకా ఉండదు అనే ఉద్దేశ్యంలో ఉన్నాడట. అయితే బాలయ్య ఈ సీటును వదులుకోవడానికి ఇష్టపడినా, ఇష్టపడకపోయినా లోకేష్ మాత్రం హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి తీరాలని కసితో ఉన్నారట అందుకే ముందు నుంచే రెండు నియోజకవర్గాల్లో బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా గుసగుసలు మొదలయ్యాయి. మొత్తంగా ఈ వ్యవహారం చూస్తుంటే బాలయ్యకు తన అల్లుడు చేతిలో వెన్నుపోటు తప్పేలా కనిపించడం లేదు అంటూ తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు సెటైర్ లు వేసేస్తున్నారు.
-Surya