ఒడిశా అసెంబ్లీ స్పీకర్‌ ఎవరో తెలుసా? ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి!!

ఒడిశా అసెంబ్లీ స్పీకర్‌గా బీజూ జనతాదళ్ ఎమ్మెల్యే బిక్రం కేశరి అరుఖా సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు సీఎం నవీన్ పట్నాయక్, ఎమ్మెల్యేలు.. స్పీకర్ బిక్రం కేశరికి శుభాకాంక్షలు తెలిపారు. అనారోగ్య కారణాలతో ఎస్ఎన్ పాత్రో స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బిక్రంను స్పీకర్‌గా నియమించారు.

బిక్రం కేశరి అరుఖా
బిక్రం కేశరి అరుఖా

బిక్రం కేశరి 1995 నుంచి భంజానగర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్ర శాసనసభలో బీజేడీ ఎమ్మెల్యేలు 114 మంది, బీజేపీ 22, కాంగ్రెస్ 9, సీపీఐ(ఎం)-1, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. ఈ సందర్భంగా బీజేపీ చీఫ్ విప్ మోహన్ మజ్హి మాట్లాడుతూ.. బిక్రం తనకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని సభ సజావుగా కొనసాగేలా వ్యవహరించాలన్నారు. తనకు సభ్యులంతా సహకరించాలని స్పీకర్ కోరారు. ఈ మేరకు సీఎం నవీన్ పట్నాయక్‌కు స్పీకర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.