ఇప్పుడు ప్రపంచం అంతా కరోనాను తొందరగా జయిస్తే చాలు.. ఇంకేం వద్దు అని ఒకటే ఆలోచన చేస్తున్నాయట.. నిజమే కదా.. అసలు ఎంత సింపుల్‌గా తన యుద్దాన్ని కొనసాగిస్తుంది.. దాదాపుగా అన్ని దేశాలు దీని బారినపడి కోలుకోలేనంతగా దెబ్బతింటున్నాయి.. ఒకవైపు ఆర్ధిక రంగం కుదేలులవుతుంటే, మరో వైపు ప్రాణ నష్టం.. అసలు ఇలా జరుగుతుందని ఎవరు ఊహించని దుస్దితిని ప్రజలు ఎదుర్కొంటున్నారు.. ఇకపోతే ఈ వైరస్ మూలంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 70 లక్షలు దాటగా.. 4 లక్షల మరణాలు సంభవించాయి. ఇలాంటి పరిస్దితుల్లో న్యూజిలాండ్‌తో సహా 9 దేశాలు కరోనా ఫ్రీ అని ప్రకటించుకున్నాయి. ప్రస్తుతం అక్కడ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కావడం లేదట. నిజంగా ఆదేశాల ప్రజలు అదృష్టవంతులే.. సమర్ధవంతమైన పాలకులు అక్కడ ఉన్నారన్న మాట అంటున్నారు ఈ ముచ్చట విన్న వారు..
ఇకపోతే కరోనాపై విజయాన్ని సాధించిన దేశాల జాబితా చూస్తే.. మొదటగా చెప్పుకోవలసింది న్యూజిలాండ్.. ఇక్కడి వైద్యాధికారులు జూన్ 8న తమ దేశంలోని చివరి కరోనా రోగి కోలుకున్నట్లు తెలిపారు. ఇక రెండోవ దేశం టాంజానియా.. ఈ దేశంలో కూడా కరోనాను కేసులు లేవని అధ్యక్షుడు జాన్ మాగుఫులి ఆదివారం చర్చి సేవలో ప్రకటించారు. కాగా టాంజానియాలో కోవిడ్ -19 కేసుల సంఖ్య 509 వద్ద ఆగిపోయింది. మూడవది వాటికన్.. 12 మంది కోలుకున్న తర్వాత తమ దేశం కరోనా రహితంగా మారిందని జూన్ 6న వాటికన్ సిటి ఒక ప్రకటన విడుదల చేసింది. ఒక్క మరణం కూడా సంభవించలేదని తెలిపింది. 12 మందిలో చివరి వ్యక్తికి కరోని నెగిటివ్‌గా వచ్చినట్లు దేశ అధికార ప్రతినిధి మాటియో బ్రూని ఒక ప్రకటన విడుదల చేశారు. 4వది ఇంకా ఫిజి. గడిచిన 45 రోజులుగా ఒక కేసు కూడా నమోదు కాలేదు. ఒక్క మరణం సంభవించలేదు. 100శాతం అందరు కోలుకున్నారు’ అని ట్వీట్ చేశారు..
5.మాంటినిగ్రో. ఈ దేశంలో 324 కేసులు నమోదు కాగా 9 మంది మరణించారు. ఇక మొదటి కరోనా కేసు గుర్తించిన 69 రోజుల తర్వాత ప్రస్తుతం తమ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఈ దేశం ప్రకటించింది. 6 వది, సిషెల్స్.. మే 18 నాటికి కరోనా ఫ్రీగా మారినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక్కడ 11 కేసులు నమోదు కాగా.. ఒక్కరు కూడా మరణించలేదట. 7వది. సెయింట్ కిట్స్, నెవిస్మే. ఈ కరిబియన్ దీవులు కరోనా వైరస్ రహితంగా మారాయి. 8వది. టిమోర్-లెస్టె ఈ దేశంలో మొత్తం 24 మంది కోలుకున్న తర్వాత మే 15న టిమోర్-లెస్టె తనను తాను కోవిడ్-19 రహిత దేశంగా ప్రకటించుకుంది. 9వది. పాపువా న్యూ గినీ.. ఇక్కడ 24 కేసులు నమోదుకాగా అందరు కోలుకున్నారు.. ప్రస్తుతం ఈ దేశం మే 4న కరోనా రహిత దేశంగా ప్రకటించుకుంది. ఇక మనదేశం ఎప్పటికో కరోనా ఫ్రీ దేశంగా ప్రకటించేదని కొందరు ఆశతో ఎదురు చూస్తున్నారట..