Prithviraj Sukumaran: KGF మేకర్స్‌తో పృథ్వీరాజ్ సుకుమారన్..‘టైసన్’గా నయా అవతార్

-

మాలీవుడ్ (మలయాళం) మల్టీ టాలెంటెడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్..సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్నమైన స్టోరిస్ ను ప్రేక్షకులకు అందించడంలో ఈ హీరో ఎప్పుడూ ముందుంటారు. ఇటీవల విడుదలైన ‘బ్రో డ్యాడీ,జన గణ మన’ చిత్రాలు విజయవంతం అయ్యాయి. ఈయన నటించిన చిత్రాలు పలు భాషల్లో రీమేక్ అవుతున్నాయి.

ఇప్పటికే ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’..‘భీమ్లానాయక్’గా తెలుగులో రీమేక్ కాగా, ఈయన దర్శకత్వం వహించిన ‘లూసిఫర్’ తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా రీమేక్ అవుతోంది. పృథ్వీరాజ్ ..‘లూసిఫర్’ చిత్రానికి సీక్వెల్ ‘లూసిఫర్-2 ఎంపురన్’కు దర్శకత్వం వహిస్తున్నారు. ‘బ్రో డాడీ’కి కూడా దర్శత్వం వహించి నటించారు. కాగా, తన దర్శకత్వంలో రాబోయే నాల్గో సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు.

మురళి గోపి ఈ చిత్రానికి కో క్రియేటర్ గా ఉండగా, ఈ చిత్రాన్ని KGF మేకర్స్ హొంబలే ఫిల్మ్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. ఈ పిక్చర్ కు తాను దర్శకత్వం వహిస్తునే నటిస్తున్నట్లు తెలిపారు. ‘టైసన్’ టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news