17 ఏళ్ల తర్వాత ఆ మహిళకు మరణశిక్ష.. ఏం చేసిందో తెలుసా..?

-

తన స్నేహితురాలిని ప్లాన్‌ ప్రకారం హత్యచేసి గర్భాన్ని కత్తితో కోసి గర్భాశయంలో ఉన్న బిడ్డను దొంగిలించిన నేరంలో 52 ఏళ్ల లీసా మాంట్‌గోమోరీ అనే మహిళకు అమెరికా ప్రభుత్వం మరణశిక్ష విధించింది. ఇండియానా రాష్ట్రంలోని టెర్రెహౌట్‌ ఫేడరల్‌ జైలులో నిందితురాలికి బుధవారం తెల్లవారుజామున విషయం ఇంజక్షన్‌ ఇచ్చి శిక్ష అమలు చేశారు. 67 ఏళ్ల తర్వాత అమెరికాలో ఓ మహిళకు మరణశిక్ష విధించారు.

దారుణానికి కారణం..?

లీసా జీవితాంతం కుంగుతూ, ఆవేదనలతోనే జీవించింది. ఆమె గర్భంలో ఉన్నప్పుడు తల్లి అధిక మోతాదులో మద్యం తాగడంతోనే లీసాకు మానసిక సమతౌల్యం లేకపోవడానికి ప్రధాన కారణంగా వైద్యులు చెబుతున్నారు. ఆమె సవతి తండ్రి పలుమార్లు అత్యచారానికి పాల్పడం.. 14 ఏళ్ల వయసు రాగానే కన్నతల్లి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించడం, ఇలాంటి బాధల నుంచి బయటపడేందుకు లీసా 18 ఏళ్లలో సవతి సొదరుడిని పెళ్లాడింది. ఐదేళ్ల కాలంలో ఆ దంపతులకు నలుగురు సంతానం కలిగిన తర్వాత లీసా పిల్లలు కాకుండా ఆపరేషన్‌ చేయించుకుంది. వారి సంసారం సాఫీగా కొనసాగిన కొన్నాళ్లకు ఇద్దరి మధ్య మనస్పర్థాలు రావడంతో విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్నపటికీ లీసా తన రెండో భర్తకు గర్భం దాల్చినట్లు చెబుతుండేది. ఈ విషయాన్ని మొదటి భర్త, రెండో భర్తకు ఎక్కడొచ్చి చెబుతాడోనని తరచూ భయపడుతూ లోలోపలా కుంగిపోయి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో వెల్లడైంది.

తల్లి అయ్యానని నిరుపించడానికేనా?.

లీసాకు 36 ఏళ్లు ఉన్నపుడు 2004లో ఈ నేరానికి పాల్పడింది. బాబీ జోస్టిన్నెట్‌ (23) 8 నెలల గర్భిణితో పరిచయమై తాను కూడా గర్భవతి అనే చెప్పుకొచ్చేది. డిసెంబర్‌ 16న బాబీ ఇంటికెళ్లిన లీసా బాబీని గొంతు నుమిలి హత్య చేసింది. కూరగాయలు కట్‌చేసే కత్తితో ఆమె గర్భాన్ని కోసి లోపలున్న ఆడ శిశువును బయటకు తీసింది. అక్కడే ఉన్న బాబీ తల్లి పోలీసుకుల సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని, ఆ శిశువుని తండ్రికి అప్పగించారు. తండ్రి వద్ద పెరుగుతున్న ఆ పాపకు ప్రస్తుతం పదహరేళ్లు. ఆ బిడ్డ తనదేనని బాబీకన్న ముందు రోజే తనకు ప్రసవం జరిగిందని నమ్మిచేందుకు ప్రయత్నించింది. విచారణలో నిజనిజాలు బయటపడ్డాయి. 2007లో లీసాకు మరణశిక్ష వి«ధించగా మంగళవారం అర్ధరాత్రి 1.31. నిమిషాలకు అమలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news