ప్రజల భద్రతా నియమాలని సరిగ్గా పాటించట్లేదన్న కారణంగా లండన్ ప్రజా రవాణా ఓలా లైసెన్సుని రద్దు చేసింది. కీలకమైన కారణాల్లో ఓలా డ్రైవర్లకి లైసెన్సు లేకపోవడం సహా వెయ్యి మందికి పైగా ట్రిప్పులను ఓలా నడుపుతుందని చూపింది. క్యాబ్ సర్వీసుల్లో భారతదేశంలో దూసుకుపోతున్న ఓలా క్యాబ్, ఫిబ్రవరి నెలలో లండన్ లో సర్వీసులని మొదలు పెట్టింది. కానీ లైసెన్సు రదు విషయం ఓలాకి సడెన్ షాక్ తగిలినట్టు చేసింది.
ప్రజా రవాణా లండన్ ఇచ్చిన తీర్పుని సవాలు చేయడానికి ఓలా వద్ద 21రోజుల టైమ్ ఉంది. ఈలోగా అప్పీల్ చేసుకుంటే తీర్పు అనుకూలంగా వస్తే మళ్లీ లండన్ లో ఓలా సేవలు ప్రారంభం అవుతాయి. మరి లండన్ లో ఓలా భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి.