హైదరాబాదర్ లోని ఓలా ఉబెర్ ప్రయాణికులకు క్యాబ్ డ్రైవర్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఇక నుంచి ఓలా ఉబెర్ లో ఏసీలు బంద్ కానున్నాయి. ఈ నెల 29 నుండి అంటే రేపటి నుంచే ఓలా ఉబర్ క్యాబ్ లో ఏసీలు వేయకూడదని డ్రైవర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల భారం కారణంగా నష్టాలు చవి చూస్తున్నా మంటున్నారు క్యాబ్ డ్రైవర్లు. ఇందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన చేశారు. ఇక రేపటి నుంచి క్యాబ్ లలో ఏసీ ఆన్ చేస్తే అదనపు రుసుము చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు డ్రైవర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.
క్యాబ్ లలో ఏసీ ఆన్ చేస్తే 25 రూపాయల నుంచి 50 రూపాయలు అదనంగా చెల్లించాలని తెలిపింది క్యాబ్స్ అసోసియేషన్. ఈ రూల్స్ రేపటి నుంచి అమలు అవు తాయని.. ఈ రూల్స్ పాటించని క్యాబ్ డ్రైవర్లపై వేటు వేస్తామని హెచ్చరించింది డ్రైవర్స్ అసోసియేషన్.