రష్యాతో శాంతి ఒప్పందానికి సిద్దం… ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ

-

ఉక్రెయిన్ పై రష్యా యుద్దం ప్రారంభించి నెల రోజులు గడిచాయి. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలను నామరూపాలు లేకుండా చేస్తోంది రష్యా. కీవ్ , మరియోపోల్, ఖార్కీవ్, సుమీ, ఎల్వీవ్ ఇలా ప్రధాన నగరాలను టార్గెట్ చేస్తోంది. సాధ్యమైనంతగా ఉక్రెయిన్ కు ఆర్థిక నష్టాన్ని మిగిల్చేలా దాడులు చేస్తోంది. కేవలం మూడు నాలుగు రోజుల్లోనే ఉక్రెయిన్ లొంగిపోతుందని అంతా అనుకున్నా… ఉక్రెయిన్ బలగాలు రష్యన్ ఆర్మీకి ఎదురొడ్డి నిలుస్తున్నాయి. 

ఇదిలా ఉంటే రష్యాతో శాంతి ఒప్పందానికి సిద్ధం అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ ప్రకటించారు. అయితే రిఫరెండం నిర్వహించాలని… మధ్యవర్తులు హామీలు ఇవ్వాలని జెలన్ స్కీ డిమాండ్ చేశారు. రష్యన్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జెలన్ స్కీ వెల్లడించారు. మరోవైపు ఉక్రెయిన్, రష్యా మధ్య టర్కీ వేదికగా నేటి నుంచి శాంతి చర్చలు జరుగనున్నాయి. ఉక్రెయిన్ కు అందించే మానవతా సాయాన్ని కూడా రష్యా అడ్డుకుంటుందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. నార్త్ అండ్ సౌత్ కొరియాల ఉక్రెయిన్ ను విభజించేందుకు రష్యా కుట్ర చేస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news