కడప పెన్నానదిలో బయటపడ్డ పురాతన ఆలయం

-

కడప జిల్లా జమ్మలమడుగు మండలం సుగమంచి పల్లి దగ్గర పెన్నానదిలో పురాతన ఆలయం ఒకటి బయట పడింది. ఆలయానికి సంబంధించిన శాసనం కూడా ఇవాళ బయట పడింది. ఇప్పటికే ఈ ప్రదేశంలోనే చాలా విగ్రహాలు బయటపడినట్లు గ్రామస్థుల వెల్లడించారు. ఇటీవల కట్టెలు కొట్టుకుంటున్న వ్యక్తికి పురాతన ఆలయం కనపడినట్లు గ్రామస్థుల వెల్లడించారు.

ఈ రోజు కూడా ఇసుక దిన్నెల మధ్య పూడి వున్న పురాతన ఆలయాన్ని గ్రామస్తులు గుర్తించారు. దీనిని రాష్ట్ర కూటుల కాలం నాటి శివ దేవాలయంగా సాశనాన్ని బట్టి గుర్తించారు. ఇసుకలో ఉన్న ఈ శివాలయం శాశనాల మీద 10వ శతాబ్దానికి సంబందించిన సంస్కృత భాష, ఇంకా కన్నడ అక్షరాలతో రాసి ఉంది. ఇవి చూసిన గ్రామస్తులు ప్రభుత్వ అధికారులకు సమాచారమందించారు.

Read more RELATED
Recommended to you

Latest news