‘ఢీ’ షోలో కొరియోగ్రాఫర్ లకు క్షమాపణలు చెప్పిన శేఖర్ మాస్టర్..!

-

ఈ టీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్ రియాలిటీ ఢీ షోకి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సరికొత్త పర్ఫామెన్స్ ల తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ టాప్ రేటింగ్ తో దూసుకుపోతూ ఉంటుంది. షో లో జడ్జిగా శేఖర్ మాస్టర్ ఎంతో క్రేజ్ సంపాదించిన విషయం తెలిసిందే.

శేఖర్ మాస్టర్ కామెంట్లు అన్ని ప్రేక్షకులు ఎంతో ఆకట్టుకుంటాయి. అయితే ఇటీవలే శేఖర్ మాస్టర్ ఢీ షో లోని కొరియోగ్రాఫర్లు అందరికీ కూడా క్షమాపణలు చెప్పారు. డీ షో లో కొరియోగ్రాఫర్ డాన్స్ పెర్ఫార్మెన్స్ పై శేఖర్ మాస్టర్ చేసిన కామెంటు ఒక పాటగా మలిచి డాన్స్ పర్ఫార్మెన్స్ చేయగా దీనిపై స్పందించిన శేఖర్ మాస్టర్… ఢీ స్టేజి పైన తన పోరాటం ఒంటరిగా మొదలైనది ఇప్పుడు మాత్రం తన వెంట ఎంతో మంది ఉన్నారని ఈ ఢీ స్టేజి ఎంతో మందికి లైఫ్ ఇచ్చిందని ఒకవేళ ఎవరైనా తన కామెంట్ లతో హార్ట్ చేసి ఉంటే నన్ను క్షమించండి అంటూ శేఖర్ మాస్టర్ సారీ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news