అమ్మ బాబోయ్..ఏం ఎనెర్జీ..ఏం డ్యాన్స్..వీడియో

-

సోషల్ మీడియాలో ఎన్నెన్నో డ్యాన్స్ వీడియో లు వైరల్ అవుతున్నాయి..అందులో బామ్మలు,తాతయ్యలు వేస్తున్న డ్యాన్స్ వీడియోలు అందరికి షాక్ ఇస్తున్నాయి.. అయితే తాజాగా మరో బామ్మ మాస్ స్టెప్పులు వేసి జనాలను కళ్ళు తిప్పుకోకుండా చేసింది..ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది…సోషల్ మీడియాలో ట్యాలెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా గుర్తింపు లభిస్తుంది. పదిమందిలో ఒకరిలా కాకుండా.. పది మంది వేరు, తాము వేరు అనేలా ఎవరు ఏం చేసినా జనాలు వాళ్లను ఆదరిస్తూ ఉంటారు.

విజయ్ కి వీరాభిమాని అయిన ఓ బామ్మ సోషల్ మీడియాను దున్నేస్తోంది. ఇప్పుడు ఈ బామ్మ సోషల్ మీడియా సెలబ్రెటీగా మారింది. విజయ్ తాజాగా చేసిన ‘బీస్ట్’ సినిమాలోని ‘అరబిక్ కుతు’ పాటకు ముసలావిడ అదిరిపోయే రేంజ్ లో స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకుంది. విజయ్ అరబిక్ కుతు పాటకు ఏ స్టెప్పులు అయితే వేశాడో అవే స్టెప్పులను ముసలావిడ కూడా వేసి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. అయితే ఈ డ్యాన్సింగ్ వీడియోని మామూలుగా కాకుండా ఓ థీమ్ తో చేసింది. తాను కూడా విజయ్ లాగా అదరగొట్టాలని ప్రత్యేకంగా డ్యాన్స్ నేర్చుకున్నట్లు బిల్డప్ ఇచ్చారు.

డ్యాన్స్ స్టెప్పులు నేర్చుకొని ముసలావిడ అదరగొట్టగా.. అందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారు. ముసలావిడ చూడానికే వయసు ఎక్కువగా కనిపిస్తుంది కానీ ఆమెకు ఇంకా వయసు పెరగలేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వయసులోనే ఇంతలా స్టెప్పులు వేసిందంటే. . ఆ వయసులో బామ్మ అదరగొట్టేసి ఉంటుందని మరికొందరు కామెంట్ చేశారు. హీరోయిన్ ఛాన్స్ కోసం బామ్మ చూస్తుందేమో అంటూ కొంతమంది ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా బామ్మ వేసిన అందరినీ తెగ ఆకట్టుకుంది..ఆలస్యం లేకుండా మీరు కూడా ఆ డ్యాన్స్ ను చూడండి..

Read more RELATED
Recommended to you

Latest news