సినీ ఇండస్ట్రీలో నటీ నటుల మధ్య పోటీ సహజమే. అయితే ఆరోగ్యకరమైన పోటీ ఉండటం ద్వారా సినీ పరిశ్రమకు మేలు జరుగుతుంది. అలాంటి వాతావరణం ఉండటం మంచిదని సినీ పరిశీలకులు చెప్తుంటారు. అలనాటి తారలు సూపర్ స్టార్ కృష్ణ, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ, నటరత్న సీనియర్ ఎన్టీఆర్ మధ్య కూడా ఆరోగ్యకరమైన పోటీ ఉండేది.
అలా ఏక కాలంలో సీనియర్ ఎన్టీఆర్, కృష్ణలకు సూపర్ స్టార్ డమ్ కొనసాగుతున్నది. ఆ టైంలోనే ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేసి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘ఈనాడు’ చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. ఈ పిక్చర్ కు పరుచూరి బ్రదర్స్ మాటలు అందించారు.ఈ మూవీ కృష్ణకు 200 వ సినిమా. ఇందులో కృష్ణ సభ్య సమాజం కోసం జీవితం త్యాగం చేసే పాత్రలో ఎంతో ఒదిగిపోయారు.
డిసెంబర్ 17,1982 న విడుదలైన చిత్రం..లోని ‘రండి కదిలి రండి’ అంటూ సాగే పాట అందరి హృదయాలను కదిలించింది.అలా ఈ సినిమా టాలీవుడ్ లో రికార్డ్స్ బ్రేక్ చేయగా అదే సమయంలో సీనియర్ ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా సీనియర్ ఎన్. టీ.ఆర్ ను అభినందిస్తూ కృష్ణ పేపర్ యాడ్ ఇచ్చారు. ఇందులో ‘ఈనాడు’ ఏక గ్రీవంగా ఎన్నికైన చిత్రమని, ఏకగ్రీవంగా ఎన్నికైన పార్టీ ‘టీడీపీ’ అని పేర్కొన్నారు. ఆ యాడ్ ను సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది బాగా వైరలవుతోంది.