ఆ మూడు చోట్లా జ‌గ‌న్ ఆశ‌లు వ‌దిలేశాడా… స‌ర్వే ఏం చెప్పింది..!

-

ఏపీలో గత ఏడెనిమిది నెలలుగా రాజధాని అమరావతి అంశం ప్రధాన రాజకీయ చర్చ గా మారిపోయింది. అధికార వైసిపి, ప్ర‌తిప‌క్ష‌ టిడిపి నేతల మధ్య రాజధాని అంశంపై ప్రతి రోజూ పెద్ద యుద్ధమే నడుస్తోంది. టిడిపి అమరావతి రాజధానిగా కొనసాగించాలని పట్టుబడుతూ ఉంది. వైసిపి మూడు రాజధానుల‌కు ఓటేసింది. రాజధాని అంశం కోర్టులో లేకపోయి ఉంటే ఈపాటికే మూడు రాజధానులుతో ఏపీ పరిపాలన ప్రారంభమై ఉండేది.

తాజాగా రాజధానుల అంశంపై తుళ్ళూరు కేంద్రంగా జరుగుతున్న ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే సీఎం జగన్ ఈ అంశంపై ఏఏ ప్రాంతాల్లో అనుకూలత ఉంది ? ఎక్కడెక్కడ వ్యతిరేకత ఉంది ? అన్న అంశంపై అంతర్గతంగా ఓ సర్వే చేయించినట్లు తెలుస్తోంది.

ఈ సర్వేలో రాజధాని ఉద్యమం రాష్ట్రమంతా లేదన్న విషయం తేటతెల్లమైంది. విశాఖను రాజధాని చేయటం ఉత్తరాంధ్ర ప్రజలు హర్షిస్తున్నారని స‌ర్వేలో తేలింది. ఇక్క‌డ వైసీపీ బాగా పుంజుకుంది. అలాగే హైకోర్టు క‌ర్నూలులో ఏర్పాటుతో కర్నూలు – కడప జిల్లాల ప్రజలు ఖుషీగా ఉన్నారు. ఇక రాజధాని వికేంద్రీకరణ తో పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రమే వ్యతిరేకత ఉందని తేలిందట. వాస్తవంగా చూస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణ, గుంటూరు జిల్లాల ప్రజలు కూడా వైసిపికి అనుకూలంగా పట్టంకట్టారు.

కృష్ణా జిల్లాలో రెండు సీట్లు… గుంటూరు జిల్లాలో రెండు సీట్లలో మాత్రమే టీడీసీ విజయం సాధించింది. ప్రకాశం జిల్లాలో నాలుగు చోట్ల తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించారు. అయితే ఈ మూడు జిల్లాల నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే టిడిపికి జై కొట్టారు. కృష్ణాలో వంశీ, గుంటూరులో గిరి, ప్ర‌కాశంలో క‌ర‌ణం బ‌ల‌రాం వైసీపీ సానుభూతి ప‌రులుగా మారిపోయారు.

పశ్చిమగోదావరి జిల్లాలో రెండు స్థానాల్లో టిడిపి విజయం సాధించింది ప్ర‌కాశం, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో రాజధాని మార్పు అంశంపై ఎక్కువ వ్యతిరేకత కనపడగా… పశ్చిమ గోదావరి జిల్లాల్లో వ్య‌తిరేక‌త‌ పాక్షికంగా ఉన్నట్టు సర్వే స్పష్టం చేసింది. అందుకే జగన్ ఈ మూడు జిల్లాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా రాజధాని మార్పు పై ఉన్న వ్యతిరేకతను అధిగమించాలని చూస్తున్నారు. ఏదేమైనా ఈ మూడు జిల్లాలో వ‌దిలేసినా రాష్ట్ర వ్యాప్తంగా త‌మ‌కు తిరుగు ఉండ‌ద‌న్న లెక్క‌ల్లోనే జ‌గ‌న్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news