లోక్ సభ స్పీకర్ గా మరోసారి ఓం బిర్లా ఎన్నిక

-

లోక్ సభలో ఎట్టకేలకు స్పీకర్ ఎన్నిక పూర్తయింది. నూతన స్పీకర్‌గా ఓం బిర్లా మరోసారి ఎన్నికయ్యారు. మూజువాణి ఓటుతో స్పీకర్‌గా ఓం బిర్లాను ఎన్నుకున్నారు. నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ అభ్యర్థి కె.సురేష్‌పై ఓం బిర్లా విజయం సాధించారు. లోక్‌సభ సమావేశాలు మూడో రోజు ప్రారంభం కాగా మొదట కొత్తగా ఎన్నికైన ఎంపీల చేత ప్రొటెం స్పీకర్‌ ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం స్పీకర్ ఎన్నిక చేపట్టారు. మరోసారి లోక్‌సభ స్పీకర్‌గా ఓంబిర్లా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు.

ఎంపీల ప్రమాణ స్వీకారం తరువాత స్పీకర్‌గా ఓం బిర్లాను ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో సహా పలువురు ఎన్డీయే ఎంపీలు బలపరిచారు. మరోవైపు ఇండియా కూటమి తరఫున కె.సురేష్‌ పేరును ప్రతిపాదించారు. దీంతో స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. ఎంపీలు మూజువాణి ఓటుతో స్పీకర్‌గా ఓంబిర్లాను ఎన్నుకున్నారు.

వరుసగా రెండోసారి స్పీకరుగా ఓం బిర్లా ఎన్నికయ్యారు.17వ లోక్ సభలోనూ ఆయన స్పీకర్ గా పనిచేశారు. ఇప్పుడు 18వ లోక్ సభకు కూడా ఆయన ప్రధాని ప్రతిపాదన చేయగా మూజువాణి ఓటుతో ఎన్నుకున్నారు. రాజస్థాన్‌లోని కోట బుండి పార్లమెంట్ స్థానం నుంచి ఆయన మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో ఓం బిర్లా గెలిచి చరిత్ర సృష్టించారు. దేశ చరిత్రలో ఇప్పటి వరకు వరుసగా రెండు సార్లు స్పీకర్‌గా ఎన్నికై ఘనత సాధించారు ఓం బిర్లా.         ఎన్నిక అనంతరం ప్రధాని మోదీ,ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పలువురు మంత్రులు స్పీకర్ ను అభినందించారు.

Read more RELATED
Recommended to you

Latest news