ఒమెగా-3 కొవ్వు ఆమ్లాల వల్ల శరీరానికి ఎంతో మేలు

Join Our Community
follow manalokam on social media

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉన్నట్లు.. మంచి కొవ్వు కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మంచి కొవ్వులో ఒమెగా-3 కొవ్వు ఆమ్లం అతి ముఖ్యమైనది. శరీరంలోని అన్ని కణాల పైపొరల్లో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. కణాల పనితీరులో ఈ ఆమ్లం ఎంతో ఉపయోగపడుతుంది. రక్తం గడ్డకట్టకుండా, రక్తనాళాల గోడల సంకోచ, వ్యాకోచాలు, దెబ్బ తగిలినప్పుడు వాపు రాకుండా నియంత్రించేందుకు ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు హార్మోన్లను తయారు చేసి నియంత్రిస్తుంది. ఒమెగా-3 కొవ్వు ఆమ్లాల వల్ల శరీరానికి చేకూరే మేలు గురించి తెలుసుకుందాం.

చేపలు-ఆకుకూరలు
చేపలు-ఆకుకూరలు

ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె పనితీరును సక్రమంగా చేస్తాయి. హార్ట్‌బీట్ స్థిరంగా కొట్టుకునేలా చూస్తుంది. అలాగే రక్తపోటును నియంత్రిస్తుంది. రక్తనాళాల పని తీరును మెరుగుపరుస్తుంది. రక్తనాళాల్లో ఏమైనా పూడికలు ఏర్పడితే ఇన్‌ప్లమేషన్ పక్రియ నిర్వర్తిస్తుంది. హార్ట్ అటాక్ వచ్చిన వారికి.. మరోసారి గుండెపోటు రాకుండా ఉంచడంలో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు ఎంతో మేలు చేస్తాయి.

మానసిక రుగ్మతలతో బాధ పడేవారికి ఒమెగా-3 ఎంతో మేలు చేస్తుంది. మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు మెదడు కణాల పొరలను తేలికగా చేస్తాయి. మానసిక జబ్బులు, కుంగుబాటు తగ్గించడానికి ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు సరిగ్గా పనిచేస్తాయి. అలాగే వయసు పెరిగే కొద్ది కొందరిలో కంటిచూపు మందగిస్తుంది. కంటి చూపు సమస్యలు ఉంటే ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు నివారిస్తాయి. రెటీనా, మెదడులో డీహెచ్ఏ రకం కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. కంటి చూపు మందగించినప్పుడు దీన్ని ఆహారంగా, మాత్రల రూపంలో తీసుకుంటే సమస్య పరిష్కరించవచ్చు.

అధిక రక్తపోటు, అధిక బరువు, మంచి కొలెస్ట్రాల్ తగ్గడం, గుండెజబ్బు, మధుమేహం, ఇన్సులిన్‌కు కణాలు స్పందించకపోవడం వంటి జీవక్రియల రుగ్మతలకు ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు ఎంతో మేలు చేస్తాయి. ఇలాంటి రుగ్మతలు తగ్గించేందుకు తోడ్పడతాయి. మతిమరుపు తగ్గించేందుకు ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు ఉపయోగపడతాయి. అందుకే తరచూ చేపలు, చేప నూనె, వంట నూనెలు, అవిసె గింజల నూనె, తాజా ఆకుకూరలు, గింజపప్పులు వంటి ఆహార పదార్థాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...