దక్షిణాఫ్రికా దేశంలో పురుడుపోసుకున్న… ఒమిక్రాన్ వైరస్.. ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఇప్పటికే ఈ మహమ్మారి… 90 దేశాలకు పైగా పాకింది అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా చాలా దేశాలకు ఈ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతోంది. ఇక మన ఇండియాలోనూ ఈ మహమ్మారి… క్రమ క్రమంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా బ్రిటన్ కంట్రీ లో ఈ ఒమిక్రాన్ వేరియంట్ విలయతాండవం చేస్తోంది.
రోజుకు లక్ష కు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. ఇక ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 1,83,240 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే ఇప్పటి వరకు ఒమిక్రాన్ తో 31 మంది ప్రపంచ వ్యాప్తంగా మృతి చెందారు. యూకే లో 1,14,685 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. 29 మంది మృతి మరణించారు. అలాగే డెన్నార్క్ లో 32,877, కెనడా లో 7500, యూఎస్ లో 6331 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఇక మన ఇండియా లోనూ.. ఒమిక్రాన్ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. మన దేశంలో 430 కి పైగా ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి.