18 దేశాలకు పాకిన ఓమిక్రాన్… సరిహద్దులు మూసినా ఆగట్లేదు..

-

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు పాకుతోంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా మహమ్మారి ఏదో రూపంలో పలు దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పుడు అన్ని దేశాలు కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ పై యుద్దం ప్రకటించాయి. ఓమిక్రాన్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాలపై పలు దేశాలు ట్రావెల్ బ్యాన్ కూడా విధించాయి. ఆయా దేశాల్లోకి రావాలంటే కఠిన ఆంక్షలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నాయి. డెల్టా వేరియంట్ కన్నా అధిక మ్యుటేషన్లు ఉండటంతో త్వరగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కూడా మరోసారి కరోనా ఓమిక్రాన్ రూపంలో తీవ్రమైతే తీవ్ర పరిణామలు ఉంటాయని  హెచ్చరిస్తోంది. మరోవైపు ఇప్పుడున్న వ్యాక్సిన్లు కూడా ఓమిక్రాన్ పై ఎఫెక్టివ్ గా పనిచేయవని మోడెర్నా ఫార్మా సంస్థ హెచ్చిరిస్తోంది.

దక్షిణాఫ్రికాలో మొదలైన ఓమిక్రాన్ అనతి కాలంలోనే పలు దేశాలకు వ్యాపించింది. ఇప్పటి వరకు 18 దేశాల్లో ఈ వేరియంట్ బయటపడింది. దీన్ని నివారించేందుకు ఇజ్రాయిల్ , జపాన్ వంటి దేశాలు విదేశీయులకు తమ సరిహద్దులను మూసినా.. కేసులు నమోదవ్వడం ప్రపంచ దేశాలను కలవరపరుస్తోంది. దక్షిణాఫ్రికాతో మొదలై బోట్స్వానా, యూకే, జర్మనీ, నెదర్లాండ్స్, డెన్మార్క్, బెల్జియం, ఇజ్రాయిల్, ఇటలీ, చెక్ రిపబ్లిక్, హాంకాంగ్, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఫోర్చుగల్, జపాన్ దేశాలకు ఓమిక్రాన్ వేరియంట్ వ్యాపించింది.

Read more RELATED
Recommended to you

Latest news