ఓమిక్రాన్ జయించిన వ్యక్తికి మళ్లీ కరోనా…

-

దేశంలో కరోనా కేసులు సంఖ్య రోజుకు  10 వేల కన్నా తక్కువగానే నమోదవుతున్నాయి. అయితే మరోవైపు ఓమిక్రాన్ వేరియంట్ మాత్రం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. దక్షిణాఫ్రికాలో మొదలైన ఓమిక్రాన్ కేసులు ప్రస్తుతం భారత్ కు చేరాయి. ఇప్పటి వరకు దేశంలో 23 మందికి ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దేశంలో మొదటిసారిగా బెంగళూర్ లో 2 కేసులు నమోదవ్వగా… అత్యధికంగా మహారాష్ట్రలో ఎక్కువ కేసులు వచ్చాయి. ఈ రాష్ట్రంలో 10 కేసులు వరకు ఓమిక్రాన్ వేరియంట్ గుర్తించారు.

ఇదిలా ఉంచితే.. ఇటీవల తొలిసారిగా బెంగళూర్ లో ఇద్దరికి ఓమిక్రాన్ వేరియంట్ కరోనా సోకింది. అయితే ఇందలో ఒకరైనా డాక్టర్ ఓమిక్రాన్ బారి నుంచి కోలుకున్నారు. అయితే అతనికి కోలుకున్న తరువాత మళ్లీ కరోనా సోకడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్ లో ఉన్నాడని.. ఎలాంటి లక్షణాలు లేవని అధికారులు  తెలిపారు. కాగా..ఓమిక్రాన్ నుంచి కోలుకున్న తరువాత మళ్లీ కరోనా సోకడం వైద్యుల్లో గుబులు రేపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news