దేశంలో ఓమిక్రాన్ తీవ్రత ఎక్కువగానే ఉంది. ఇప్పటికే దేశంలో 200 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఇప్పటికే ఓమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం కూడా ప్రకటించింది. అయితే రానున్న న్యూఇయర్ వేడుకలను ద్రుష్టితో పెట్టుకుని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఎక్కువ మంది గుమిగూడితే మళ్లీ కరోనా కేసులు, ఓమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగే అవకాశం ఉండటంతో ఆంక్షలు పెట్టేందుకు సిద్ధం అవుతున్నాయి.
తాజాగా న్యూ ఇయర్ వేడుకలపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. ముఖ్యంగా న్యూఇయర్ వేడుకపై ఆంక్షలు విధించింది. క్లబ్స్, మాల్స్ , రెస్టారెంట్ల లో 50 శాతం కెపాసిటీతోనే సెలబ్రెషన్స్ జరుపుకోవాలని, డీజేకు అనుమతి లేదని ఆంక్షలు విధించింది. టీకా తీసుకోని వారికి వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది. ఈ ఆంక్షలు డిసెంబర్ 30 నుంచి జనవరి 2,2022 వరకు అమలులో ఉంటాయని తెలిపింది కర్ణాటక గవర్నమెంట్.