స్టార్ హీరోయిన్ కు ఫుడ్ డెలివ‌రీ బాయ్ వేధింపులు !!

మ‌ల‌యాళ న‌టి పార్వ‌తి తిరువొత్తుకు ఓ వ్య‌క్తి నుంచి వేధింపులు ఎదుర‌య్యాయి. గ‌త రెండు ఏళ్లు గా… ఓ వ్య‌క్తిని ఆమెను వేధింపుల‌కు గురి చేస్తున్నాడు. దీంతో ఆమె పోలీస్ స్టేష‌న్ కు వెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ వ్య‌క్తిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. హ‌ర్ష అనే వ్య‌క్తి కొల్లాంలోనివాసం ఉంటున్నాడు. అత‌డికి దాదాపు గా 34 ఏళ్లు ఉంటుంది.

అత‌డు ఫుడ్ పార్శిల్ ప‌ట్టుకుని హీరోయిన్ ఇంటికి త‌ర‌చుగా వ‌స్తుండే వాడు. మొద‌టిసారి వ‌చ్చిన‌ప్పుడే ఆహారాన్ని తీసుకురావొద్ద‌ని పార్వ‌తి కుటుంబం తెలిపింది. అయిన‌ప్ప‌టికీ.. అత‌డు విన‌లేదు. ఆమెకు ఇబ్బంది కలిగిస్తూనే ఇంటికి వ‌స్తుండేవాడు. సెక్యూరిటీతో గొడ‌వ పెట్టుకునేవాడు. గ‌త కొన్ని ఏళ్లు గా ఆమె సెల్ ఫోన్ కు అస‌భ్య క‌ర రీతిలో సందేశాలు పంపిస్తున్నాడు. దీంతో ఆ వ్య‌క్తిపై పార్వ‌తి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు.. ఐపీసీ 354 డీ సెక్ష‌న్ కింద అత‌డి పై కేసును న‌మోదు చేశారు. ప్ర‌స్తుతం ఆ యువ‌కుడు జైలు లో ఉన్నాడు.