ఓమిక్రాన్ పై ప్రధాని మోదీ కీలక ఆదేశాాలు

దేశంలో ఓమిక్రాన్ తీవ్రమవుతున్న వేళ ప్రధాని మోదీ గురువారం అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమీక్ష సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఓమిక్రాన్ వేరియంట్ ను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. ఓమిక్రాన్ ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సమర్థవంతంగా వ్యవహరించాలని సూచించారు. అవసరమైతే.. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పండగ వేళల్లో రాత్రి కర్ప్యూలు విధించాలని సూచించారు. దీంతో పాటు టెస్టింగ్, ట్రేసింగ్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు.

క్రిస్మస్, న్యూ ఇయర్ వేళ ప్రజలు గుమిగూడకుండా చర్యలు తీసుకోవలని రాష్ట్రాలకు ప్రధాని సూచించారు. కరోనా ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి కంటైన్మెంట్ ప్రాంతాలుగా చేయాలని సూచించారు. కనీసం 14 రోజులు ఈ ఆంక్షలను పాటించాలని ఆదేశించారు. ఇదే విధంగా ప్రజలంతా వ్యాక్సినేషన్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నార. ముఖ్యంగా రాష్ట్రాలు ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ప్రజలంతా మాస్క్, శానిటైజేషన్, బౌతిక దూరం పాటించాలన్నారు.