ఓమిక్రాన్ ఎఫెక్ట్… పంజాబ్ రాష్ట్రం కీలక నిర్ణయం.. నైట్ కర్ఫ్యూ విధింపు

-

ఓమిక్రాన్ దెబ్బకు పలు రాష్ట్రాలు భయపడుతున్నాయి. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో వస్తున్న కేసుల్లో 50 శాతానికి కన్నా ఎక్కువగా ఓమిక్రాన్ కేసులే ఉంటున్నాయన్న అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో రాష్ట్రాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు కూడా విధించాయి.

తాజాగా పంజాబ్ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. పట్టణ ప్రాంతాల్లో, మున్సిపల్ ఏరియాల్లో, టౌన్స్ లో ఈ కర్ఫ్యూ అమలులో ఉండనుంది. బార్‌లు, సినిమా హాళ్లు, మాల్స్, రెస్టారెంట్లు, స్పాలు 50% సామర్థ్యంతోనే పనిచేాయాలని ప్రభుత్వం ఆదేశించింది. స్మిమ్మింగ్ ఫూల్స్ లతో పాటు అన్ని స్టోర్ట్స్ కాంప్లెక్స్ లని మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. ఇదే విధంగా అన్ని విద్యా సంస్థలని మూసివేసింది. కేవలం ఆన్ లైన్ భోదనకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ముఖ్యంగా భౌతిక దూరం, మాస్కులు తప్పని సరి చేసింది. అయితే అత్యవసర సేవలు, ఫ్యాక్టరీల్లో పలు కంపెనీల్లో షిఫ్టుల వారీగా పనిచేసేవారికి అనుమతి ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news