BREAKING : దేశంలో 12 కు చేరిన ఓమిక్రాన్ కేసులు… మహారాష్ట్రలో ఓమిక్రాన్ విలయం..

-

ఇండియాలో ఓమిక్రాన్ విలయం ప్రారంభమైంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం సాయంత్రానికి ఇండియాలో ఓమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 12కు చేరింది. తాజాగా మహారాష్ట్రలో కొత్తగా 7 కేసులు.. మొత్తంగా 8 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మహారాష్ట్రలో ఓమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో కొత్తగా వచ్చిన 7 కేసుల్లో 6 కేసులు పింప్రి- చించ్వాడాలో.. ఒక కేసు పుణేలో .. అంతకు ముందు నమోదైన మరొక కేసు ముంబైలో నమోదైంది.

ప్రస్తుతం ఇండియలో నమోదైన కేసుల్లో మహారాష్ట్రలో 8 కేసులు, గుజరాత్ లో 1, ఢిల్లీలో 1, కర్ణాటకలో 2 మొత్తం 12 కేసులు నమోదయ్యాయి. వీరితో సన్నిహితంగా ఉన్న వ్యక్తుల శాంపిళ్లను ప్రస్తుతం జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబులకు పంపారు. వివరాలు వచ్చిన తర్వాత ఎంత మందికి ఓమిక్రాన్ వేరియంట్ కరోనా సోకిందో తెలుస్తుంది. మరోవైపు ఏయిర్ పోర్టుల వద్ద కేంద్రం, రాష్ట్రాలు అన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. రిస్క్ ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చిన వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. ఎవరికైానా కరోనా పాజిటివ్ వస్తే వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news