దేశంలో మరో ఓమిక్రాన్ కేసు నమోదు… దేశంలో 33కు చేరిన కేసుల సంఖ్య

-

దేశంలో ఓమిక్రాన్ కేసు చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రపంచంలో కలవరం కలిగిస్తున్న.. ఇండియాను కూడా వదలడం లేదు. తాజాగా ఇండియాలో మరో ఓమిక్రాన్ కేసు నమోదైంది. ఇప్పటికీ దేశంలో 33 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఢిల్లీలో మరో కేసు వచ్చింది. ఇటీవల జింబాబ్వే నుంచి వచ్చిన వ్యక్తికి ఓమిక్రాన్ పాజిటివ్ గా తేలింది. దీంతో ఢిల్లీలో కేసుల మొత్తం 2కు చేరింది.

నిన్న ఒక్క రోజే ఇండియాలో 9 ఓమిక్రాన్ కేసులు నమోదవ్వడంతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. ఇందులో మహారాష్ట్రలోనే 7 కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం ఓమిక్రాన్ సోకిన వారికి స్వల్ప లక్షణాలే ఉండటం కొంత ఉపశమనం కలిగించే విషయం. దీనికి తోడు ఇద్దరు ఓమిక్రాన్ బాధితులు కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఇలా కోలుకున్న వారిలో ఒకరు ముంబైకి చెందిన వారు కాగా.. మరొకరు పుణేకి చెందిన వారు. రానున్న రోజుల్లో కూడా ఇండియాలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో 2300కు పైగా ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే ప్రపంచం ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా సంభవించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news