భారత్ లో 200కు చేరిన ఓమిక్రాన్ కేసులు… వెల్లడించిన కేంద్రం.

-

దేశంలో ఓమిక్రాన్ వేరియంట్ అంతంతకు విస్తరిస్తోంది. దక్షిణాఫ్రికాలో మొదలైన మహమ్మాని భారత్ తో పాటు ప్రపంచంలోని 97 దేశాలకు పాకింది. తాజాగా భారత్ లో 200 కు చేారాయి ఓమిక్రాన్ కేసుల సంఖ్య. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్ట్రాల పరంగా చూస్తే మహారాష్ట్ర, ఢిల్లీల్లో ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే ఓమిక్రాన్ బారి నుంచి 77 మంది కోలుకున్నట్లుగా కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఓమిక్రాన్ నమోదయ్యింది.

ఓమిక్రాన్ కేసుల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. తెలంగాణలో ఇప్పటి వరకు 20 ఓమిక్రాన్ కేసులు నమోదవ్వగా.. ఇందులో నలుగురు విదేశీయుల ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. మరోవైపు కేంద్రం కూడా ఓమిక్రాన్ పై ప్రత్యేక ద్రుష్టి పెట్టింది. ఇప్పటికే ఎట్ రిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చేవారికి ఎయిర్ పోర్టుల్లోనే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. ఒకవేళ కరోనా పాజిటివ్ వస్తే జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం శాంపిళ్లను పరీక్షిస్తున్నారు.

రాష్ట్రాల వారీగా ఓమిక్రాన్ కేసుల వివరాలు

మహారాష్ట్ర-54, ఢిల్లీ -54, తెలంగాణ-20, కర్ణాటక-19, రాజస్థాన్ -18, కేరళ-15, గుజరాత్ -14, యూపీ-2, ఏపీ-1, చంఢీగడ్-1, తమిళనాడు-1, వెస్ట్ బెంగాల్ -1

Read more RELATED
Recommended to you

Latest news