ఓమిక్రాన్ ఎఫెక్ట్.. ఆ రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ.

-

దేశంలో ఓమిక్రాన్ విస్తరిస్తోంది. ఇప్పటికే కేసులు సంఖ్య 600కు చేరువయ్యాయి. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలకు యూటీలకు ఆదేశాాలు జారీ చేసింది. పండగల వేళ అప్రమత్తంగా వ్యవహరించాలని… కరోనా కేసులు పెరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దేశంలో ఇప్పటికే 19 రాష్ట్రాలకు ఓమిక్రాన్ వైరస్ విస్తరించింది. మహారాష్ట్ర, ఢిల్లీల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది.

ఓమిక్రాన్ భయాలతో ఒక్కొక్క రాష్ట్రం ఆంక్షల ఛట్రంలోకి వెళుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధించాయి. చాలా రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూను విధించాయి. తాజాగా కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూని విధించాయి. కేరళలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూను విధించాయి. ఈ ఆంక్షలు డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు కొనసాగుతాయని కేరళ ప్రభుత్వం ఆదేశించింది. మరో వైపు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈరోజు నుంచి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించాయి. మళ్లీ ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ వచ్చే వరకు ఈ కర్ఫ్యూ కొనసాగుతుంది ఉత్తరాఖండ్ సర్కార్ తెలిపింది.

ఇప్పటికే యూపీ, మధ్య ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news