ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలంగాణ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలసిందే. అయితే ఈ రోజు ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పై తెలంగాణ హై కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనాలు విన్న హై కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కాగ ఎంపీ రాఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్ తరుపున న్యాయవాది వెంకటేశ్ వాదనలను వినిపించారు.
అక్రమాస్తుల కేసులో సీఎం హోదాలో జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని అన్నారు. దీని విషయంలో జగన్ కు కోర్టు నోటిసులు ఇవ్వాలని న్యాయవాది వెంకటేశ్ కోరారు. అనంతరం హై కోర్టు స్పందిస్తూ.. జగన్ బెయిల్ రద్దు పై సీబీఐ అభిప్రాయలను అడిగింది. దీనిపై సీబీఐ కోర్టు తీర్పు తర్వాత పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని సీబీఐ తరపు న్యాయవాది కోర్టు కు తెలిపారు. చివరగా తెలంగాణ హై కోర్టు జగన్ , విజయసాయి రెడ్డి బెయిల్ తీర్పును రిజర్వ్ చేసింది.