భారతదేశంలో మొదటి మొబైల్ కాల్ మాట్లాడిన రోజు నేడే.!

-

భారతదేశంలో సరిగ్గా 25 ఏళ్ల క్రితం అంటే 1995 జూలై 31న మొదటి మొబైల్ ఫోన్ కాల్ మాట్లాడారు. కేంద్ర టెలికాం మంత్రి సుఖ్ రామ్, అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసు మొదటిసారిగా మొబైల్ ఫోన్‌లో మాట్లాడారు. కోల్‌కతాలోని రైటర్స్ బిల్డింగ్‌లో ఉన్న జ్యోతి బసుతో న్యూ ఢిల్లీలోని సంచార్ భవన్‌లో ఉన్న సుఖ్ రామ్ తొలి మొబైల్ కాల్ మాట్లాడారు. మోడీ టెల్‌స్ట్రా మొబైల్ నెట్ సర్వీస్ ద్వారా తొలి కాల్ వెళ్లింది.

భారతదేశంలో మోడీ గ్రూప్, ఆస్ట్రేలియా టెలికామ్ దిగ్గజం టెల్‌స్ట్రా జాయింట్ వెంచర్ మోడీ టెల్‌స్ట్రా భారతదేశంలో టెలికాం సేవల్ని ప్రారంభించడం విశేషం. ఈ కంపెనీ నెట్వర్క్ ద్వారా సుఖ్ రామ్, జ్యోతి బసు తొలి మొబైల్ కాల్ మాట్లాడారు. ఇది జరిగి 25 ఏళ్లవుతోంది. ఆ తర్వాత భారతదేశంలో టెలికాం రంగంలో విప్లవం చూశాం. అప్పట్లో మొబైల్ ఫోన్ ఉండటం ఓ లగ్జరీ.

Read more RELATED
Recommended to you

Latest news