టీఎంసీ ఓబీసీలకు అన్యాయం చేస్తోంది : ప్రధాని మోడీ

-

పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రభుత్వం తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం ద్వారా ముస్లింలకు ఓబీసీల హక్కులను కల్పిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. దీనివల్ల ఓబీసీలకు అన్యాయం జరుగుతందని తెలిపారు. మధురాపూర్ లోక్సభ స్థానంలోని కద్వీప్ లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. పశ్చిమ బెంగాల్లో అభివృద్ధి పథకాలను అమలు చేయడానికి టీఎంసీ నిరాకరిస్తోందని మండిపడ్డారు. దళితులు, వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కల్పించిన రాజ్యాంగంపై దాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో బహిరంగంగా రిజర్వేషన్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు. కలకత్తా హైకోర్టు తప్పుడు సర్టిఫికేట్లను రద్దు చేసినప్పటికీ, ఆ తీర్పును టీఎంసీ అంగీకరించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి ఇతర కార్యక్రమాల అమలును అడ్డుకుందని తెలిపారు. జాతీయ భద్రతకు సైతం విఘాతం కలిగిస్తోందన్నారు. టీఎంసీ, ఇండియా కూటమి పశ్చిమ బెంగాల్ ని అభివృద్ధికి వ్యతిరేక దిశలో నెట్టివేస్తున్నాయని చెప్పారు. వికసిత్ భారత్ అమలు చేయడానికి, బీజీపీకి వికసిత బెంగాల్ కూడా ఎంతో అవసరమని నొక్కి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news