మరోసారి కాశ్మీర్ ఫైల్స్ సినిమా పై వివాదం..!!

-

మరోసారి  కాశ్మీర్ ఫైల్స్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. తాజాగా ఐఎఫ్ఎఫ్ఐ జ్యూరీ హెడ్ నవాద్ లాపిడ్ కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ఉద్దేశించి  నెగిటివ్ కామెంట్స్ చేయడం తో మళ్లీ వివాదం చెలరేగింది.వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’  మంచి వసూళ్లు రాబట్టింది. అయితే ఈ చిత్రానికి వివాదాలు కూడా వచ్చాయి.. ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో చూపించిన  విధానం బాగాలేదని దీనిపై రాజకీయ విమర్శలు వెల్లు వెత్తాయి.

తాజాగా 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికగా మరోసారి వివాదం చెలరేగింది. ఐఎఫ్ఎఫ్ఐ జ్యూరి హెడ్ నవాద్ లాపిడ్ మూవీ మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం చూసి  రాజకీయ ఉద్దేశ్యంలో భాగంగా తెరకెక్కిన చిత్రంలా ఉంది. ది కాశ్మీర్ ఫైల్స్ మూవీలో చూపించిన వన్నీ అవాస్తవం అని ఆయన కామెంట్స్ చేశారు. ఒక అంతర్జాతీయ వేదికపై ఇలాంటి చిత్రాల గురించి మాట్లాడేది లేదని అన్నారు.

నవాద్ వ్యాఖ్యలను అనుపమ్ ఖేర్ తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖుల ఖండిస్తున్నారు. సినిమా వాస్తవంగా జరిగిన అవమానమైన సంఘటనలు మాత్రమే చూపించారని, అందులో ఎటువంటి కల్పన లేదని ఆయనకు వ్యతిరేకంగా, ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రానికి మద్దతుగా మాట్లాడుతున్నారు. దీనిపై మరోసారి బీజేపీ-కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news