రేపు మధ్యాహ్నం 2 గంటలకు విశ్వవిజేతగా అవతరించాడు ముందు జరగనున్న పోటీలకు ప్రారంభ సమయం. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా పది ఉత్తమైన జట్లు కప్ కోసం ఎంతగానో పోరాడనున్నాయి. ఇండియా ఆతిధ్యం ఇస్తున్న ఈ వరల్డ్ కప్ కోసం బీసీసీఐ మరియు ఐసీసీ లు సంయుక్తంగా ప్రతి ఒక్క విషయాన్నీ ముందుగానే చర్చించుకుని ఏ సమస్య , లోపం లేకుండా నిర్వహిస్తున్నాయి. మొత్తం ఇండియాలోని పది వేదికలు ఈ మ్యాచ్ లకు ఆతిధ్యం ఇవ్వనున్నాయి. మొదటి మ్యాచ్ ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్యన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో ఉన్న నరేంద్ర మోదీ స్టేడియం లో జరగనుంది. ఈ మ్యాచ్ లను స్టేడియం కు వచ్చి డైరెక్ట్ గా చీర్స్ చేస్తూ మ్యాచ్ ను వీక్షించవచ్చు. లేదా మీ ఇంటిలోనే ఉంటూ ఎంతో సరదాగా టీవీ లలో కూడా చూసే అవకాశం ఉంది.
కాగా ఈ వరల్డ్ కప్ లో రానున్న ప్రతి ఒక్క మ్యాచ్ ను కూడా స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ లో చూడవచ్చు.. ఒకవేళ మీరు హాట్ స్టార్ ఓటిటి ఛానెల్ ఉంటే అందులోనూ చూసి ఎంజాయ్ చేయవచ్చు.