గంభీర్ ఒక యోధుడు: రవిచంద్రన్ అశ్విన్

-

వరల్డ్ కప్ లో రేపటి నుండి మెయిన్ మ్యాచ్ లు స్టార్ట్ కానున్నాయి. మొదటి మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ కు మరియు న్యూజిలాండ్ కు మధ్యన జరగబోతోంది. ఇక ఇండియా తన మ్యాచ్ ను ఆదివారం ఆస్ట్రేలియా తో ఆడనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ వరల్డ్ కప్ ఆడుతున్న స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాజీ ఇండియా ప్లేయర్ గౌతమ్ గంభీర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అశ్విన్ మాట్లాడుతూ.. మాములుగా అందరూ గంభీర్ ను తప్పుగా అర్ధం చేసుకుంటారని, కానీ గంభీర్ ఒక గ్రేట్ టీం మ్యాన్ అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. టీం విజయం కోసం ఎపుడూ పోరాడే మంచి వ్యక్తి అన్నారు. స్పిన్ బౌలింగ్ ను చాలా చక్కగా ఆడతాడు.. మ్యాచ్ పరిస్థితులను బాగా అర్ధం చేసుకుని అందుకు తగిన విధంగా తన బ్యాటింగ్ ను మార్చుకుంటాడు.. ఇందుకు చక్కని ఉదాహరణ 2011 వరల్డ్ కప్.

ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాక జట్టుపై ఒత్తిడి పడకుండా అప్పుడు తన వ్యక్తిగత స్కోర్ 100 కు పైగా చేసే అవకాశం ఉన్నా నిశ్వసంగా జట్టు కోసం ఆడాడు అంటూ అశ్విన్ గంభీర్ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు.

Read more RELATED
Recommended to you

Latest news