ఏపీలో ఎస్ఎంఎస్ చిచ్చు.. నిమ్మగడ్డకు పొరపాటున ?

ఏపీలో కొత్త వివాదం తెర మీదకు వచ్చింది. ఏపీ సీఎంవోకి ఎస్‌ఈసీ మధ్య ఎస్సెమ్మెస్‌ వివాదం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. లోక్ సభ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ అలానే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రేపు జరిగే సమవేశానికి హాజరుకావాలంటూ సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్
ఎస్ఈసీ నిమ్మగడ్డకు ఎస్సెమ్మెస్ పంపారు. అయితే రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న తనను అలా ఎలా పిలిపిస్తారంటూ తమ పేషీ ద్వారా తిరిగి మెసేజ్‌ పంపారు నిమ్మగడ్డ.

హైకోర్టు చీఫ్ జస్టిస్ హోదాలో ఉన్న తనతో ఈ విధంగా వ్యవహరిస్తారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తానని కూడా ఆయన హెచ్చరించారు. దీంతో ఎస్ఈసీ సెక్రటరీ వాణిమోహన్‌కు పంపబోయి పొరపాటున ఎస్ఈసీకి పంపామని ప్రవీణ్ ప్రకాష్ కూడా కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చారు. మరోవైపు తన అనుమతి లేకుండా ఎన్నికల నిర్వహణపై జరిగే సమావేశాలకు హాజరు కావొద్దంటూ వాణి మోహన్‌ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశించారని చెబుతున్నారు. ఈ వ్యవాహారం చాలా దూరం వెళ్ళేలానే కనిపిస్తోంది.