కరోనాను చంపే స్ప్రే వచ్చేస్తోంది !

కరోనా ఉధృతి ఆగడం లేదు. వైరస్ కట్టడి కోసం వ్యాక్సిన్ ప్రక్రియ పెద్ద ఎత్తున జరుగుతున్నా మరో పక్క భారీ ఎత్తు కరోనా కేసులు నమోదవుతన్నాయి. అయితే కరోనా వైరస్ కు నాసల్ స్ర్పే సిద్ధమైంది. కరోనా వైరస్ ఊపిరి తిత్తుల లోకి రాకుండా ముక్కు రంధ్రాల్లో నే చంపేసే ఈ నాజల్ స్ప్రే త్వరలోనే భారత్ మార్కెట్ లోకి రానుంది. కెనడాకు చెందిన సానోటైజ్ సంస్థ దీనిని సిద్ధం చేసింది.

వైరస్ ను ఎదుర్కోవడంలో ఈ స్ప్రే 95 శాతం పని చేస్తుందని సంస్థ చెబుతోంది. నాసల్‌ స్ప్రే వాడకంతో కరోనా వైరస్‌ పెరుగుదలని గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. కోవిడ్ 19 వైరస్ ( Covid19 Virus ) కు కారణమయ్యే వైరస్‌ స్థాయిని 95 శాతం వరకు తగ్గించిందని కంపెనీ తెలిపింది. ఇప్పటికే లండన్ లో అత్యవసర అనుమతులు పొందిన ఈ సంస్థ భారత్ లో భాగస్వామి కోసం చూస్తోంది.