అద్భుత‌మైన ఫీచర్ల‌తో వ‌న్‌ప్ల‌స్ 7టి, టీవీల‌ను లాంచ్ చేసిన వ‌న్‌ప్ల‌స్‌..!

-

వ‌న్‌ప్ల‌స్ 7టి ఫోన్‌లో 6.55 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 గిగాహెడ్జ్ రిఫ్రెష్ రేట్ అందిస్తున్నారు. దీంతో ఫోన్ తెర స్మూత్‌గా ఆప‌రేట్ అవుతుంది.

ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్‌కు వ‌న్‌ప్ల‌స్ ఎప్ప‌టి నుంచో గట్టి పోటీనిస్తూ వ‌స్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్‌, నోట్ సిరీస్‌లో విడుద‌ల చేసే ఫోన్ల‌కు దీటుగా వ‌న్‌ప్ల‌స్ అద్భుత‌మైన ఫోన్ల‌ను లాంచ్ చేస్తూ శాంసంగ్‌తో పోలిస్తే చాలా త‌క్కువ ధ‌ర‌ల‌కే వాటిని వినియోగ‌దారుల‌కు అందిస్తోంది. దీంతో వ‌న్‌ప్ల‌స్ మార్కెట్‌లో త‌న స్థానాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు మెరుగు ప‌రుచుకుంటూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే ఆ కంపెనీ ఇవాళ వ‌న్‌ప్ల‌స్ 7టి పేరిట మ‌రో నూత‌న ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను భార‌త్‌లో లాంచ్ చేసింది. దీంతోపాటు నూత‌నంగా వ‌న్‌ప్ల‌స్ టీవీని కూడా ఆ కంపెనీ విడుద‌ల చేసింది. మ‌రి వాటిల్లో ఉన్న ఫీచ‌ర్ల వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందామా..!

oneplus 7t and oneplus tvs launched

వ‌న్‌ప్ల‌స్ 7టి ఫోన్‌లో 6.55 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 గిగాహెడ్జ్ రిఫ్రెష్ రేట్ అందిస్తున్నారు. దీంతో ఫోన్ తెర స్మూత్‌గా ఆప‌రేట్ అవుతుంది. డిస్‌ప్లేకు 3డి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్ల‌స్ ప్రాసెస‌ర్‌, 8 జీబీ ర్యామ్ ఫీచ‌ర్ల‌ను ఏర్పాటు చేసినందున ఫోన్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌ను ఇందులో అందిస్తున్నారు. వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి అద‌నంగా 16 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న మ‌రొక అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 12 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న మ‌రో టెలిఫోటో కెమెరాను ఏర్పాటు చేశారు. దీంతో 2ఎక్స్ ఆప్టిక‌ల్ జూమ్ ల‌భిస్తుంది. ఇక ఇందులో అందిస్తున్న నైట్ స్కేప్ మోడ్ వ‌ల్ల త‌క్కువ కాంతిలోనూ అద్భుత‌మైన ఫొటోలు తీసుకోవ‌చ్చు.

వ‌న్‌ప్ల‌స్ 7టి ఫోన్‌లో ముందు భాగంలో 16 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలోనూ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌ను ఏర్పాటు చేశారు. అలాగే డాల్బీ అట్మోస్‌, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 3800 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 30టి వార్ప్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ త‌దిత‌ర ఇత‌ర అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్‌కు చెందిన 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.37,999 ఉండ‌గా, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.39,999గా ఉంది. ఈ నెల 28వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను అమెజాన్‌, వ‌న్‌ప్ల‌స్ ఆన్‌లైన్ స్టోర్‌, వ‌న్‌ప్ల‌స్ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్‌ల‌లో విక్ర‌యించ‌నున్నారు.

వ‌న్‌ప్లస్ 7టి ఫీచ‌ర్లు…

* 6.55 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే, 2400 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* 3డి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్ల‌స్ ప్రాసెస‌ర్
* 8 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 10, డ్యుయ‌ల్ సిమ్
* 48, 16, 12 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
* ఇన్‌డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్
* 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0
* 3800 ఎంఏహెచ్ బ్యాట‌రీ, వార్ప్ చార్జ్ 30టి ఫాస్ట్ చార్జింగ్

వ‌న్ ప్ల‌స్ టీవీ…

ఇవాళ జ‌రిగిన వ‌న్‌ప్ల‌స్ ఈవెంట్‌లో ఆ కంపెనీ వ‌న్‌ప్ల‌స్ టీవీ 55 క్యూ1, వ‌న్‌ప్ల‌స్ టీవీ 55 క్యూ1 ప్రొ పేరిట రెండు నూత‌న 4కె క్యూలెడ్ టీవీల‌ను లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ టీవీ 9.0 ఓఎస్ ఆధారంగా ఈ టీవీలు ప‌నిచేస్తాయి. వీటిల్లో డాల్బీ విజన్‌, 50 వాట్ల స్పీక‌ర్లు, డాల్బీ అట్మోస్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఇత‌ర స్మార్ట్‌టీవీల్లో ఉన్న దాదాపు అన్ని ఫీచర్లు వీటిల్లోనూ ఉన్నాయి. కాగా వ‌న్‌ప్ల‌స్ టీవీ 55 క్యూ1 ధ‌ర రూ.69,900 ఉండగా టీవీ 55 క్యూ1 ప్రొ ధ‌ర రూ.99,900 గా ఉంది. ఈ నెల 28వ తేదీ నుంచి వీటిని అమెజాన్‌, వ‌న్‌ప్ల‌స్ ఆన్‌లైన్ స్టోర్‌, వ‌న్‌ప్ల‌స్ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్‌ల‌లో విక్ర‌యించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news