వ‌న్‌ప్ల‌స్ వాచ్‌.. స్మార్ట్‌వాచ్ విడుద‌ల‌.. ధ‌ర‌, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

-

మొబైల్స్ త‌యారీదారు వ‌న్‌ప్ల‌స్ కొత్త‌గా 9 సిరీస్‌లో మూడు నూత‌న ఫోన్ల‌ను విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. అయితే ఆ ఫోన్ల‌తోపాటు వ‌న్‌ప్ల‌స్ కొత్త‌గా వ‌న్‌ప్ల‌స్ వాచ్ పేరిట ఓ నూత‌న స్మార్ట్‌వాచ్‌ను కూడా విడుద‌ల చేసింది. ఇందులో అనేక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

oneplus watch launched in india

వ‌న్‌ప్ల‌స్ వాచ్ ఫీచ‌ర్లు

* 1.39 ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లే, 454 x 454 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* ఆండ్రాయిడ్ 6.0 ఆపైన డివైస్‌ల‌కు స‌పోర్ట్
* 110కి పైగా వ‌ర్క‌వుట్ మోడ్స్‌, ప‌ల్స్, డిస్ట‌న్స్‌, క్యాల‌రీస్‌, స్పీడ్ మెట్రిక్స్
* ఆప్టిక‌ల్ హార్ట్ రేట్ సెన్సార్‌, బ్ల‌డ్ ఆక్సిజ‌న్ సెన్సార్‌
* వాట‌ర్ రెసిస్టెంట్‌, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, 4జీబీ స్టోరేజ్
* 402 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 14 రోజుల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్

వ‌న్‌ప్ల‌స్ వాచ్ ధ‌ర రూ.16,999 గా ఉంది. అయితే లాంచింగ్ కింద దీన్ని రూ.14,999కే అందిస్తున్నారు. ఈ ఆఫ‌ర్ కొంత కాలం మాత్ర‌మే ఉంటుంది. ఏప్రిల్ నెల‌లో ఈ వాచ్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తుంది. అయితే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల‌తో ఈ వాచ్‌పై అద‌నంగా మ‌రో రూ.2వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ను పొంద‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news