అభ్యర్ధి విషయంలో బీజేపీ డిఫెన్స్..ప్రచారంలో జానారెడ్డి ఓవర్ కాన్ఫిడెన్స్

-

నాగార్జున సాగర్ అభ్యర్థి ఎంపిక విషయంలో బీజేపీ ఎటు తేల్చుకోలేకపోతోంది. టీఆర్‌ఎస్‌,కాంగ్రెస్‌ను ఎదుర్కోవాలంటే.. ఎవరిని నిలబెట్టాలనేదానిపై క్లారిటీకి రాలేకపోతోంది. టీఆర్ఎస్‌ అభ్యర్థిని ప్రకటించాకే తమ క్యాండేట్‌ను ప్రకటించాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు జానారెడ్డి మాత్రం నియోజకవర్గంలో ఎవరిని ప్రచారానికి రానివ్వకుండా ఓవర్ కాన్ఫిడెన్స్
ప్రదర్శిసున్నారన్న టాక్ కాంగ్రెస్ శ్రేణుల్లో వినిపిస్తుంది.

నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు షెడ్యూలు వచ్చింది. నామినేషన్లు కూడా జోరందుకోనున్నాయి. బీజేపీ ఎవరిని బరిలో నిలుపాలో తేల్చుకోలేక పోతుంది. ఎవరికి టికెట్ ఇస్తే లాభం చేకూరుతుంది అనే దాని పై ఒక అవగాహనకు రాలేక పోతుంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చినా.. ఎమ్మెల్సీ ఫలితాలు తీవ్ర నిరాశకు గురి చేశాయి. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్‌లో కూడా ఓటమి పాలైతే.. అది భవిష్యత్‌లో పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతుందని బీజేపీ ఆందోళన చెందుతోంది.

ఇక సాగర్‌లో కాంగ్రెస్ నుండి పోటీకి దిగుతున్న జానా రెడ్డి బలమైన అభ్యర్థి.. టీఆర్‌ఎస్‌ కూడా అక్కడ పట్టున్న వ్యక్తినే బరిలోకి దింపుతోంది. ఈ రెండు పార్టీలని తట్టుకుని నిలిచే అభ్యర్థి ఎవరనే దాని పై కమలదళం మల్లగుల్లాలు పడుతోంది. దుబ్బాకతో పోల్చుకుంటే సాగర్‌లో బీజేపీకి అంత పట్టు లేదు. దీంతో ఏ మాత్రం తేడా వచ్చినా ఇబ్బంది అనే భావనతో ఉన్న ఆ పార్టీ నేతలు.. అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచీ అడుగులు వేస్తన్నారు. టికెట్ ఆశిస్తున్నా వారిలో బలమైన నాయకులు లేరని అంచనాకు వచ్చిన బీజేపీ అధికార పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నేతల కోసం ప్రయత్నాలు చేస్తోంది.

ఇక సాగర్ లో గెలిస్తే మళ్లీ పార్టీ తెలంగాణలో పుంజుకుంటుందని కాంగ్రెస్ వాదులు అనుకుంటున్నారు. సిట్టింగ్ సీటు టీఆర్ఎస్ ది కావడం సానుభూతి ఓట్లు సామాజిక సమీకరణలు ఆ పార్టీకి ప్లస్ గా మారనుండటంతో అతి విశ్వాసం పనికి రాదంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. జానారెడ్డిని చూసి ఓట్లు వేస్తారన్నది వదిలేసి నల్గొండ జిల్లాలో పట్టున్న ఉత్తమ్ కోమటిరెడ్డి బ్రదర్స్ ను..బలమైన వాయిస్ వినిపించే రేవంత్ ని ప్రచారానికి ఆహ్వానించాలంటున్నాయి.

కాంగ్రెస్ చేయించుకున్న సర్వేలోనూ జానారెడ్డి,టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుటుంబానికి ఓట్ల తేడా స్వల్పంగానే ఉండటంతో ఏ మాత్రం పట్టు సడలించినా ఫలితం ప్రతికూలంగా వస్తుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. జానారెడ్డి పట్టుదలకు పోకుండా అందరినీ కలుపుకుని ప్రచారం చేస్తే మేలని కాంగ్రెస్ వాదులు లోలోన మధనపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news