ఆంధ్ర ప్ర‌దేశ్ లో కొన‌సాగుతున్న పోలింగ్

-

ఆంధ్ర ప్ర‌దేశ్ లో స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు ఈ రోజు ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభం అయ్యాయి. నెల్లురు కార్పొరేష‌న్ తో పాటు మ‌రో 12 మున్సిపాలిటీ ల్లో ఈ రోజు ఎన్నిక‌లు ప్రారంభం అయ్యాయి. ఆకివీడు, జ‌గ్గ‌య్య పేట‌, కొండ ప‌ల్లి, దాచే ప‌ల్లి, గుర‌జాల‌, ద‌ర్శి, బుచ్చిరెడ్డి పాలెం, కుప్పం, బేతంచ‌ర్ల‌, క‌మ‌లా పూరం, రాజం పేట‌, పెనుకొండ మున్సిపాలిటీ ల్లో ఉద‌యం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం అయింది. ఈ ఎన్నిక‌ల‌లో పూర్తి ఆధిప‌త్యం అధికార వైఎస్ఆర్‌సీపీ ఉంటుంద‌ని తెలుస్తుంది.

అయితే రాష్ట్ర ప్ర‌జ‌ల చూపు మాత్రం చిత్తూర్ జిల్లా లోని కుప్పం మున్సిపాలిటీ పై ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు కుప్పం మున్సిపాలిటీల్లో టీడీపీ తిరుగు లేకుండా ఉండేది. అయితే ప్ర‌స్తుతం కుప్పం లో జ‌రుగుతున్న మున్సిపాలిటీ ఎన్నిక‌ల‌లో వైఎస్ఆర్ సీపీ విజ‌యం సాధించి మున్సిపాలిటి సొంతం చేసుకుంటామ‌ని దీమా వ్య‌క్తం చేస్తున్నాయి. అయితే టీడీపీ మాత్రం కుప్పం త‌మ కంచు కోట అని.. అక్క‌డ అధికార పార్టీ పప్పులు ఉడ‌క‌వు అని అంటుంది. అయితే కుప్పం లో ఎవ‌రు విజ‌యం సాధిస్తారో చూడాలి మ‌రి.

Read more RELATED
Recommended to you

Latest news