దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ లో తెలంగాణ ప్రస్తావించిన అంశాలు ఇవే

-

నిన్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశం జరిగిన సనగతి తెలిసిందే. అయితే ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక అంశాలు ప్రస్తావించింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, నక్కలగండి ఎత్తిపోతల పథకం అనుమతులపై ప్రస్తావించింది. జనవరి 15 లోపు dpr లు krmb కి సమర్పించాలని.. dpr ల అడరాంగా సెంటర్ వాటర్ కమిషన్ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. రాజీవ్ గాంధి సంగంబండ బ్యారేజ్ ద్వారా కర్ణాటక లో మునిగి పోనున్న ప్రాంతాల పై తెలంగాణ, కర్ణాటక ఉమ్మడి గా సర్వే నిర్వహించాలని నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.

kcr
kcr

ఏపీ కి తెలంగాణ 6015 కోట్ల విద్యుత్ బకాయిల అంశం పై రెండు రాష్ట్రాలు కూర్చొని పరిష్కరించుకోవాలని నిర్ణయం(ఈ అంశం పై తెలంగాణ హై కోర్ట్ లో పిటిషన్ వేసిన ap) తీసుకోవాలని చెప్పింది. 9 వ షెడ్యూల్ లో ఉన్న సంస్థల రెండు రాష్ట్రాల మధ్య పంపకాలలో 23 సంస్థల పై అభ్యంతరం చెప్పిన తెలంగాణ… తెలంగాణ అభ్యంతరాలను వెంటనే పరిశీలించి తమ అభిప్రాయాలను ఏపీ చెప్పాలని పేర్కొంది.

ఢిల్లీ ఏపీ భవన్ విభజన ప్రతిపాదనలు పరిశీలించి కేంద్రం స్పీడ్ గా పరిష్కరించాలని డిమాండ్ చేసింది. 10 వ షెడ్యూల్ పై సుప్రీంకోర్టు తీర్పు పరిశీలించి అందుకు అనుగుణంగా కేంద్ర హోం శాఖ చర్యలు తీసుకోవాలని కోరింది. ట్రైబల్ యూనివర్సిటీ ని వీలయినంత తొందరగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది తెలంగాణ సర్కార్.

Read more RELATED
Recommended to you

Latest news