గుడ్ న్యూస్‌.. ఇక ఉల్లి లొల్లి తొలగినట్టే..

-

గ‌త కొన్ని రోజులు ఉల్లికి డిమాండ్ అంతా ఇంతా కాదు. దీంతో కోయ‌కుండానే క‌న్నీళ్లు పెట్టిస్తోంది ఉల్లి. ఉల్లి కొనలేం, తినలేం అన్న పరిస్థితుల్లో చాలామంది ఉల్లి వినియోగాన్నే మానేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉల్లి ఐటమ్స్ కు రాంరాం చెప్పేశాయి. భారీ వరదలు, వర్షాలతో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పంట దెబ్బతినడంతో రాష్ట్రానికి రావాల్సిన సరుకు దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పంట డిమాండ్ కు తగ్గట్టు లేకపోవడంతో ఒక దశలో ఉల్లి కిలో రూ.200 వరకు చేరింది. అయితే సంక్రాంతి పండుగ ముందు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌. ఎందుకంటే ఉల్లి ధర దిగివచ్చింది.

పండగ నాటికి సాధారణ స్థితికి చేరుకునేలా ఉంది పరిస్థితి. ఇక రెండు మూడు రోజుల్లో ఉల్లి ధర రూ.30 దిగి వస్తుందని, పండగనాటికి రూ.20లు అయినా ఆశ్చర్యపోనవసరం లేదని వ్యాపారులు చెబుతున్నారు. స్థానికంగా పంట చేతికి రావడం, మహారాష్ట్ర నుంచి రబీ పంట దిగుమతి అవుతుండడం, ఈజిప్ట్ నుంచి భారీగా కేంద్రం ఉల్లి దిగుమతులు చేసుకోవడం వంటి కారణాలు ఉల్లి ధర తగ్గడానికి దోహదపడ్డాయి.

Read more RELATED
Recommended to you

Latest news