అంతర్జాతీయ క్రికెట్ లో పారదర్శకత కోసం ఎప్పటికప్పుడు నిభంధనల్లో మార్పులు చేర్పులు చేస్తూ వస్తుంది అంతర్జాతీయ క్రికెట్ మండలి. ఎప్పటికప్పుడు మారుస్తూ, ఉన్నవాటిని సరిచేస్తూ, కొత్త వాటిని ప్రవేశ పెట్టె ప్రయత్నం చేస్తుంది. అయితే కొన్ని నిభందనలు మాత్ర౦ క్రికెట్ లో చికాకు తెప్పిస్తున్నాయి. ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ గెలిచిన తర్వాత ఈ చికాకు మరింత ఎక్కువగా మనకు కనపడుతున్నాయి.
తాజాగా లెగ్ బైస్ విషయంలో కూడా క్రికెట్ లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్ లో భాగంగా గురువారం మెల్‌బోర్న్ స్టార్స్-సిడ్నీ థండర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కూడా ఆసిస్ మాజీ దిగ్గజ క్రికెటర్ మార్క్ వా కామెంటేటర్‌గా వ్యవహరించాడు. ఈ సందర్భంగా ఒక రూల్ అతనికి చికాకు తెప్పించింది.
ఈ క్రమంలో సిడ్నీ థండర్స్ బ్యాట్స్‌మెన్ అలెక్స్ రాస్ పదే పదే లెగ్ బై రూపంలో పరుగులు చేయడంతో చిరాకు పడిన మార్క్ వా లెగ్ బైస్ అనేది అనవసరమైన రూల్ అని అసహనం వ్యక్తం చేయడమే కాకుండా ఇది ఎప్పటి నుంచో క్రికెట్‌లో అమలవుతుందని, బంతిని బ్యాట్స్‌మెన్ టచ్ చేయలేనప్పుడు పరుగు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించాడు. శరీరానికి, ప్లాడ్లకు కానీ బంతి తగిలి పరుగులు ఇవ్వడం వల్ల క్రికెట్‌లో పారదర్శకత లోపించినట్లేనని అసహనం వ్యక్తం చేసాడు.