సంక్షోభ పరిస్థితుల్లో ఇంధన ధరలు తగ్గించింది భారత్ మాత్రమే : కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ

-

కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పందించారు. అంతర్జాతీయ మార్కెట్లో సంక్షోభ పరిస్థితులు ఉన్నప్పటికీ ఇంధన ధరలు తగ్గించింది కేవలం భారత్ మాత్రమేనని తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వంలోనే ఇది సాధ్యమైందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు ఎక్సెజ్ సుంకాన్ని తగ్గించిందని గుర్తు చేశారు. పెట్రోల్ పై 2 శాతం, డీజిల్పై కొంతమేర వ్యాట్ తగ్గించిందని తెలిపారు. ఫలితంగా సెంట్రల్ ఎక్సైజ్ సుంఖం తగ్గిందన్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల మాదిరిగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు వ్యాట్ను తగ్గించలేదని విమర్శించారు. ఇటానగర్ -చెన్నయ్ మధ్య వ్యాట్ వ్యత్యాసం వల్ల పెట్రోల్ ధర రూ.9.90, లక్నో తెలంగాణ మధ్య రూ.12.76, గాంధీనగర్- బెంగళూరు మధ్య రూ.8.21, పనాజీ-కేరళ మధ్య రూ.12.35, గౌహతి-కోల్కతా రూ.6.80గా ఉందన్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో గడ్డు పరిస్థితులు ఉన్నప్పటికీ చమురు ధరలను అదుపు చేయడం భారత్ కు మాత్రమే సాధ్యమైందని కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news