ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.నాలుగైదు గంటలపాటు ప్రాజెక్ట్ అంతా పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పోలవరంను చూసి తీవ్ర బాధ, ఆవేదనకు లోనయ్యాను అని అన్నారు. ప్రాజెక్ట్ ఈ పరిస్థితికి తెచ్చింది గత ప్రభుత్వమేని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఇక తొలిసారి వైఎస్ జగన్ గురించి మాట్లాడిన చంద్రబాబు.. ‘వైఎస్ జగన్ రాజకీయాల్లో ఉండదగని వ్యక్తి వచ్చి ఆంధ్ర ప్రదేశ్ కి శాపంగా మారారు అని విమర్శించారు.ఆయన రాజకీయాల్లోకి రాబట్టే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్‌కు ఈ పరిస్థితివచ్చింది. ఆయన రావడం తప్పు కాదు.. క్షమించరాని నేరం అని ధ్వజమెత్తారు. అప్పటి నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ చేపట్టారు. అధికారంలోకి వస్తూనే 5 రోజుల్లోనే కాంట్రాక్టు ఏజెన్సీని మార్చేశారు. 2020 వరదల్లో డయాఫ్రం వాల్ 35 శాతం పాడయ్యింది. 480 కోట్లతో అత్యవసరంగా నిర్మిస్తే, దానిని అలా చేశారు అని మండిపడ్డారు.