ఇండియాలో 100 కి 100% సీట్లు కొట్టింది జనసేన పార్టీ మాత్రమే : పవన్ కళ్యాణ్

-

ఈరోజు వెలువడిన అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో జనసేన పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…నా జీవితమంతా ఎప్పుడూ కూడా దెబ్బలు తింటాను, మాటలు పడతాను ,తిట్టించుకుంటాను అయితే నాపై ఇంత ప్రేమ ఉందని ఈ గెలుపు సాధించేవరకు నాకు కూడా తెలియదు. భారతదేశంలో 100 కి 100% సీట్లు కొట్టింది జనసేన పార్టీ మాత్రమే.ఈ విజయం జనసైనికులకు తో పాటు ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష . జనసేన పాలనలో మార్పు రావాలి అని కోట్లాదిమంది ప్రజల ఆకాంక్ష ఈరోజు నెరవేరింది

అన్నం పెట్టే రైతుకి ,రక్షణ లేని ఆడబిడ్డలకే రక్షణ కల్పించాల్సిన సమయం ఆడవాళ్లు వారి కాళ్ళ మీద వారు నిలబడేలా చేయాల్సిన సమయం ఏపీలో చీకటి రోజులు ముగిసాయి .చీకటి అధ్యాయం ముగిసింది.ఏరు దాటాక తెప్ప తగలేసే రకం కాదు నేను మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత నాది.నాకు ప్రజలు ఈరోజు చాలా పెద్ద బాధ్యత అప్పగించారు. గెలిచింది పోటీ చేసింది 21 అసెంబ్లీ,2 పార్లమెంటు . గెలిచింది నూటికి నూరు శాతం కానీ బాధ్యత ఎంత ఉంది అంటే 175 సీట్లు మనమే గెలిస్తే ఎలా ఉంటుందో అంత పెద్ద బాధ్యత నా మీద ఉంది అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news