భార‌త్‌లో విడుద‌లైన రెడ్‌మీ నోట్ 9.. ధ‌ర ఎంతంటే..?

-

మొబైల్స్ త‌యారీదారు షియోమీ భార‌త్‌లో రెడ్‌మీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేసింది. ఇందులో 6.53 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌ను అందిస్తున్నారు. మీడియాటెక్ హీలియో జి85 ప్రాసెస‌ర్‌, 6జీబీ వ‌ర‌కు ర్యామ్ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌తో ఈ ఫోన్ ప‌నిచేస్తుంది. ఇందులో వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాతోపాటు 8 మెగాపిక్స‌ల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌, 2 మెగాపిక్స‌ల్ మాక్రో సెన్సార్‌, 2 మెగాపిక్స‌ల్ డెప్త్ సెన్సార్‌ల‌ను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 13 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను వెనుక వైపు ఇచ్చారు. ఇందులో 5020 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఏర్పాటు చేయ‌గా, దీనికి 22.5 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌ను అందిస్తున్నారు.

Redmi Note 9 smart phone launched in India

రెడ్‌మీ నోట్ 9 స్పెసిఫికేష‌న్లు…

* 6.53 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి85 ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్
* 64/128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్
* ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌, 48, 8, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 13 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
* డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి
* 5020 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 22.5 వాట్ల ఫాస్ట్ చార్జింగ్

రెడ్‌మీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.11,999 ఉండ‌గా, 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.13,499 ఉంది. అలాగే 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.14,999గా ఉంది. వీటిని అమెజాన్‌తోపాటు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌, ఎంఐ హోం స్టోర్‌, ఆఫ్‌లైన్ స్టోర్‌ల‌లో జూలై 24వ తేదీ నుంచి విక్ర‌యించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news