అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన ఒప్పో ఎఫ్‌17 ప్రొ స్మార్ట్ ఫోన్‌..!

-

మొబైల్స్ త‌యారీదారు ఒప్పో నూత‌నంగా ఎఫ్‌17 ప్రొ పేరిట ఓ స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేసింది. ఎఫ్ సిరీస్‌లో వ‌చ్చిన లేటెస్ట్ ఒప్పో ఫోన్ ఇదే కావ‌డం విశేషం. ఇందులో 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన సూప‌ర్ అమోలెడ్ డిస్ ప్లేను ఏర్పాటు చేశారు. ముందు వైపు 16, 2 మెగాపిక్స‌ల్ కెపాసిటీలు క‌లిగిన‌ డ్యుయ‌ల్ పంచ్ హోల్ కెమెరాలు రెండు ఉన్నాయి. మీడియాటెక్ హీలియో పి95 ప్రాసెస‌ర్‌, 8జీబీ ప‌వ‌ర్‌ఫుల్ ర్యామ్‌ను ఏర్పాటు చేశారు. 48, 8, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌ను ఇందులో అందించారు. 4015 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉంది. దీనికి 30 వాట్ల ఫ్లాష్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల ఫోన్ వేగంగా చార్జింగ్ అవుతుంది.

OPPO F17 Pro smart phone launched

ఒప్పో ఎఫ్‌17 ప్రొ స్పెసిఫికేష‌న్లు…

* 6.43 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే
* 2400 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 3 ప్ల‌స్ ప్రొటెక్ష‌న్
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి95 ప్రాసెస‌ర్‌, 8జీబీ ర్యామ్‌
* 128జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 10 ఓఎస్
* 48, 8, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 16, 2 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరాలు
* ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ
* డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి
* 4010 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫ్లాష్ చార్జ్

ఒప్పో ఎఫ్‌17 ప్రొ స్మార్ట్ ఫోన్ మ్యాజిక్ బ్లూ, మ్యాట్ బ్లాక్‌, మెటాలిక్ వైట్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. రూ.22,990 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు సెప్టెంబ‌ర్ 7 నుంచి ల‌భ్యం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news