కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (02-09-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో బుధ‌‌‌వారం (02-09-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

covid 19 top 10 updates on 2nd september 2020

1. ఏపీలో కొత్త‌గా 10,392 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,55,531కి చేరుకుంది. 1,03,076 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 3,48,330 మంది కోలుకున్నారు. 4,125 మంది చ‌నిపోయారు.

2. భారతదేశంలో కరోనా మరణాల రేటు చాలా తక్కువగా ఉంద‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేస్ ఫాటాలిటీ రేట్ (సీఎఫ్ఆర్) 1.76 శాతం వద్ద ఉందని వివరించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యల్పంగా ఉందని పేర్కొంది.

3. దేశంలో కొత్త‌గా 78,357 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 37,69,523కు చేరుకుంది. 8,01,282 మంది చికిత్స పొందుతున్నారు. 29,01,908 మంది కోలుకున్నారు. 66,333 మంది చ‌నిపోయారు.

4. తెలంగాణలో కొత్తగా 2,892 కరోనా పాజిటివ్ కేసులు నమోద‌య్యాయి. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,30,589 కి చేరుకుంది. మొత్తం మరణాల సంఖ్య 846 కి చేరింది. 97,402 మంది కోలుకున్నారు. 33,341 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

5. చైనాలో 10 వేల మందికి పైగా కరోనా వ‌ల్ల చ‌నిపోయార‌ని, కానీ ఆ దేశ‌‌ ప్రభుత్వం వాటిని బ‌య‌టి ప్రపంచానికి చెప్ప‌డం లేద‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఫ్యాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు.

6. ఢిల్లీలో కొత్త‌గా 2,509 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,79,569కు చేరుకుంది. 4,481 మంది చ‌నిపోయారు. 1,58,586 మంది కోలుకున్నారు. 16,502 యాక్టివ్ కేసులున్నాయి.

7. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 25.6 మిలియన్లకు చేరుకుంది. 8,55,000 మంది క‌రోనా వ‌ల్ల చ‌నిపోయారు. ఈ వివరాలను జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వెల్ల‌డించింది.

8. క‌ర్ణాట‌క‌లో కొత్తగా 9,860 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,61,341కు చేరుకుంది. 2,60,913 మంది కోలుకున్నారు. 5,950 మంది చ‌నిపోయారు. 94,459 యాక్టివ్‌ కేసులున్నాయి.

9. త‌మిళ‌నాడులో కొత్త‌గా 5,990 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,39,959కు చేరుకుంది. ‌7,516 మంది చ‌నిపోయారు. 3,80,063 మంది కోలుకున్నారు. 52,380 యాక్టివ్ కేసులున్నాయి.

10. జపాన్ దేశం త‌మ పౌరులంద‌రికీ క‌రోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా పంపిణీ చేయ‌నున్న‌ట్లు తెలియ‌జేసింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చిన త‌క్ష‌ణ‌మే అంద‌రికీ ఉచితంగా దాన్ని పంపిణీ చేస్తామ‌ని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news