ఏప్రిల్ 17న ఇందిరాపార్క్ వద్ద విపక్షాల నిరాహార దీక్ష

-

 

T-SAVE ఫోరం ఆధ్వర్యంలో నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ.. T-SAVE పోరాటానికి మద్దతు తెలిపిన కాంగ్రెస్, సీపీఐ, న్యూడెమొక్రసీతో సహా వివిధ పార్టీల నాయకులకు, ప్రజా, విద్యార్థి సంఘాల నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. నిరుద్యోగులు, విద్యార్థుల కోసం రాజకీయాలకు అతీతంగా కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు.

ఏప్రిల్ 17న ఇందిరాపార్క్ వద్ద చేపట్టే నిరాహార దీక్షలో ఉమ్మడిగా పాల్గొని, తొమ్మిదేండ్లుగా నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై, ప్రభుత్వ మోసాలపై గళం వినిపించుదాం. పూర్తి స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం సర్కారుపై ఒత్తిడి తీసుకొద్దామన్నారు. నిరుద్యోగులు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో KCR కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు దక్కాయి.నిరుద్యోగులు, విద్యార్థుల భవిష్యత్తు రాజకీయ బాధ్యత మాత్రమే కాదు నైతిక బాధ్యత కూడా. T-SAVE ఆధ్వర్యంలో ఈ నెల 17న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే దీక్షకు పార్టీలకు అతీతంగా తరలివచ్చి, నిరసన తెలుపుదామన్నారు వైఎస్‌ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news