ప్రతిపక్షాలు నా శత్రువులు కాదు : ప్రధాని మోడీ

-

ప్రతిపక్ష నేతలను శత్రువులుగా భావించబోనని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. వారితో కలిసి పని చేయాలని భావిస్తానన్నారు. వారిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయబోనని, వాళ్లు దాదాపు 70 ఏళ్లు ఏ దేశాన్ని పాలించారని అన్నారు. వాళ్ల నుంచి మంచి గ్రహించేందుకు ప్రయత్నిస్తానని మోడీ పేర్కొన్నారు. తాజాగా NDTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ.. తనపై ప్రతిపక్షాల దాడులు, డెవలప్ మెంట్ ఫిలాసఫీ, ప్రస్తుత లోక్ సభ ఎన్నికలు వంటి పలు అంశాలపై మాట్లాడారు ప్రధాని మోడీ.

మరోవైపు కొంతమంది అవినీతి పరులను మీడియా ఇంటర్వ్యూ చేయడం చూసి షాక్ అయ్యానని తెలిపారు ప్రధాని మోడీ. ఒకప్పుడు ఛార్లెస్ శోభ్ రాజ్ వంటి క్రిమినల్స్ ని అలా ఇంటర్వ్యూ చేయడం చూశానన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ పై వచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇటీవల మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. దీనిపై మోడీ పరోక్ష విమర్శలు చేసినట్టు తెలుస్తోంది. సమాజంలో జవాబుదారితనం తగ్గుతోందని, నేరస్థులకు ఆదరణ దక్కుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news