రావు రమేష్ కి బర్త్ డే విషెస్ చెప్పిన పుష్ప 2 టీమ్

-

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల‌లో పుష్ప‌-2 ది రూల్ ఒక‌టి. పుష్ప ది రైజ్‌ తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న అల్లు అర్జున్ ప్ర‌స్తుతం ఈ సినిమా సీక్వెల్‌లో బిజీగా ఉన్నాడు. సుకుమార్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుంది. ఇప్ప‌టికే మూవీ నుంచి టీజ‌ర్‌తో పాటు ఫ‌స్ట్ సింగిల్‌ను విడుద‌ల చేయ‌గా.. యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. ఇక ఈ మూవీలో రావు ర‌మేష్ సిద్ద‌ప్ప అనే పొలిటిక‌ల్ లీడ‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

అయితే నేడు రావు ర‌మేష్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా రావు ర‌మేష్‌కు బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇక ఈ పోస్ట‌ర్ చూస్తే.. పుష్ప 2లో కూడా రావు ర‌మేష్ మ‌రోసారి త‌న న‌ట‌విశ్వ‌రూపం చూపించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుండ‌గా.. సునీల్, అన‌సూయ‌, అజ‌య్ ఘోష్, డాలీ ధ‌నుంజ‌య, ఫ‌హాద్ ఫాసిల్, అజ‌య్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news